calender_icon.png 16 March, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కును పరిరక్షిస్తాం

16-03-2025 12:00:00 AM

టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ 

రాజేంద్రనగర్, మార్చి 15 (విజయక్రాంతి): విజయక్రాంతి కథనానికి జిహెచ్‌ఎంసి అధికారులు స్పందించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్లో సిరిమల్లె నగర్ లేఔట్‌లో నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 350 గజాల పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సమగ్ర వివరాలతో ‘విజయక్రాంతి’ శనివారం కథనం ప్రచురించింది. పార్కులో భారీ స్థాయిలో మట్టి వేసి రాళ్లు, ఇనుప రాడ్లు వేశారని కథనంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ సిబ్బందితో కలిసి వెళ్లి కబ్జాకు గురైన పార్కును పరిశీలించారు. పార్కులో పోసిన మట్టితో పాటు రాళ్లను ఇనుపరాడ్లను తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. కబ్జాకు యత్నిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.