calender_icon.png 1 April, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలాలను కాపాడుతాం

31-03-2025 12:36:51 AM

- ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ 

- భవానికాలనీలో పార్కు ప్రారంభం

 రాజేంద్రనగర్, మార్చి 30 (విజయ క్రాంతి ): నియోజకవర్గం లోని ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భవాని కాలనీలో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని కాపాడిన నేపథ్యంలో దానిని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో పార్కు స్థలం కబ్జాకు గురవడంతో ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హైడ్రా సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకుని అప్పగించడంతో ఈరోజు పార్కు ప్రారంభించి  మొక్కను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఎన్నికల వరకే పార్టీలోని అనంతరం అందరం కలిసి మెలిసి అభివృద్ధి చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.