శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని, జనవరి 18 (విజయక్రాంతి) : శ్రీపాద ట్రస్టు ద్వారా మంథని నియోజక వర్గంలో క్రీడలను ప్రో త్సహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు సోదరు డు, శ్రీపాద ట్రస్ట్ చైర్మ న్ దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. శనివారం శ్రీ పాద స్మారక క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను శనివారం శ్రీను బాబు అందజేశారు.
రామగిరి మండలంలోని సింగరేణి సంస్థకు చెందిన రాణి రుద్రమదేవి స్టేడియంలో రామగిరి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మాజీ శాసనసభావతి శ్రీ శ్రీపాద రావుస్మారకార్థం నిర్వహించారు. మంథని డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యా కు హాజరైన శ్రీను బాబు గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతిగా రూ.30,016, రెండో బహుమతి రూ.15,016 క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేసారు.
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ ముందుకు సాగాలని, క్రీడల్లో గెలపోటములు సహజమ న్నారు. ఇకనుంచి మరిన్ని క్రీడలు నిర్వహించి, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడమే కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట చెంద్రయ్య, ఆరెల్లి కొమురయ్య గౌడ్, బర్ల శ్రీను, మోత్కూరు అవినాష్ గౌడ్, కాటం సత్యం, ముస్త్యాల శ్రీనివాస్, కొరకొప్పుల తులసి రామ్ గౌడ్, కోట రవీందర్ రెడ్డి,కొప్పులు గణపతి, దాసరి శివ, తీగల సమ్మయ్య, బంకు మల్లేష్, బోగి సంజీవ్, మట్ట రాజకుమార్, గాజు రఘుపతి, అంజి పాల్గొన్నారు.