calender_icon.png 21 January, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తాం

21-01-2025 01:42:29 AM

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ 

శేరిలింగంపల్లి,జనవరి 20(విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద పీట వేస్తామని పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. సోమవారం శేరిలింగంపల్లిలోని పలు డివిజన్ ల లో రూ. 98లక్షల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్స్, నిర్మాణ పనులకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ..నియోజకవర్గం పరిధిలో మౌలిక వసతులు కల్పించేందుకు ఎల్లవేళల ముందు ఉంటానని తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాదాలు పాటించి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.