calender_icon.png 22 December, 2024 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల రుణాలు మేమే చెల్లిస్తాం

03-08-2024 03:26:31 AM

  1. గాయత్రి షుగర్స్ యాజమాన్యం హామీ 
  2. శాంతించిన సదాశివనగర్ మండల రైతులు 

కామారెడ్డి, ఆగస్టు 2 (విజయక్రాంతి): రైతుల పేర తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు గాయత్రి షుగర్స్ యాజమాన్యం అంగీకరించింది. రైతుల పేరున నిజామాబాద్ యూనియన్ బ్యాంక్‌లో యాజమా న్యం రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం చేస్తున్న రైతురుణమాఫీని తమకు అమలు చేయాలని సదరు రైతులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. రైతుల పేర ప్యాక్టరీ యాజమాన్యం థర్డ్ పార్టీ కింద రుణాలు తీసుకున్నందున రుణమాఫీకి అర్హులు కారని అధికారులు తెలిపారు. దీం తో శుక్రవారం సదాశివనగర్ మండల రైతు లు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రసిడెంట్ వేణుగోపాల్‌రావును కలిసి, రుణమాఫీ విషయమై నిలదీశారు.

దీంతో రైతులకు ఎలాం టి నష్టం జరగకుండా, రుణాలను ఫ్యాక్టరీ యాజమాన్యమే చెల్లిస్తుందని వేణుగోపాల్‌రావు హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాం తించారు. వేణుగోపాల్‌రావును కలిసిన వారి లో సదాశివనగర్ సింగిల్ విండో చైర్మన్ కమలాకర్ రావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సదాశివనగర్ మాజీ సర్పం చ్ బద్దం శ్రీనివాస్‌రెడ్డి, కుప్రియాల్ మాజీ ఉపసర్పంచ్ కలాలి చుక్కసాయగౌడ్, నాగరాజు, మంగళి సాయిలు, నల్ల శ్రీనివాస్‌రెడ్డి, నారెడ్డి విఠల్, అన్నం అశోక్, వంగిటి రాజు, వంగిటి శ్రీను, కొతి లింగారెడ్డి ఉన్నారు.