11-04-2025 01:34:19 AM
ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి హామీ
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ఇక నుంచి ప్రతి నెలా చెల్లించవ లసిన ఉద్యోగ, ఉపాధ్యాయ బిల్లులను రెగ్యులర్‌గా చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి మంత్రి భట్టిని మర్యాదపూర్వంగా కలిసి ఉద్యోగ, ఉపాధ్యాయ పెండింగ్ బిల్లుల అంశాన్ని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పం దించిన భట్టి.. ఇక నుంచి బిల్లులను క్రమం తప్పకుండా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. భట్టిని కలిసినవారిలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మా ధవరెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డి, నాయకులు అబ్దుల్ గఫార్, సోమి రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.