calender_icon.png 9 February, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తాం

08-02-2025 01:02:29 AM

* బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 

* నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్ ఫిబ్రవరి 7 : (విజయ క్రాంతి): బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని,  కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆరోపించారు.

శుక్ర వారం నిజామాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలం గాణ ప్రభుత్వం కుల గణన తప్పులతడకగా ఉందని ఎంతో గొప్పగా చేశామని చెప్పు కుంటున్న ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ సర్వే రిపోర్టులను తప్పుడు తడకగా తెలుస్తూ చించేసాడని ఈ సందర్భంగా ధనపాల్ గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం కులగనన పొంతన లేకుండా ఉందని ఆయన ఆరోపించారు. బీసీ వర్గం ప్రజలను మోసం చేసే కుట్ర అసెంబ్లీలో జరిగిందన్నారు. రాబోయే సంస్థగత ఎన్నికల్లో బీసీ వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద నాటకం వాడుతోందని గత ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీ జనాభా 1.85 కోట్లకు పైగా దాదాపు 51% పైగా ఉంటే ఇప్పటి కాంగ్రెస్ లెక్కల ప్రకారం 1.65 కోట్లు ఉందని 46.25% గా నిర్ణయించిందని దాదాపు 21 నుండి 25 లక్షల వరకు బీసీలు ఏమయ్యారని సూర్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పదేళ్ల నుండి బీసీ జనాభా పెరగలేదా అని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల నుండి బీసీలు అంతరించిపోతున్న వర్గంగా ప్రభుత్వం భావిస్తుందని ఆయన ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. బీసీ కుటుంబాలు తమ రిజర్వేషన్లను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీ కులగన పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద కుట్ర పన్నుతోందని అందరు గమనించాలని కాంగ్రెస్ కుట్రను బీసీ వర్గం తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

10. 8% బీసీ ముస్లింలని వారిని బీసీ లో కలపడానికి కాంగ్రెస్ పెద్ద కుట్రకు తెరలైపోయిందని ముస్లింలలో బీసీలు ఏంటని రాజ్యాంగంలో లేని పదాలు కాంగ్రెస్ సృష్టిస్తుందని ఆయన అన్నారు. బీసీ ముస్లింలనేది ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏవంత్ రెడ్డి అయిన సహచర మంత్రివర్గం మతిలేని ప్రకటనలు చేస్తూ బీసీ బిడ్డలను మోసం చేస్తున్నారని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కులగన పేరుతో ముస్లింలను బీసీలలోకి మార్చాలని కుట్రను కాంగ్రెస్ చేయబోతుందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్  హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 15 పేజీల హామీలు ఏమయ్యాయి అని బీసీల సంక్షేమం కోసం సంవత్సరానికి 20వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2024 25 సంవత్సరానికి గాను కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించి 400 కోట్లు మాత్రమే ఖర్చు చేసి బీసీ ప్రజలను మోసం చేసిందని ఆయన తెలిపారు.

మొన్నటి అసెంబ్లీ సమావేశంలో కనీసం బీసీ సబ్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు వడ్డీ లేని పది లక్షల రూపాయల రుణాల ఊసే ఎత్తడం లేదని మూడు లక్షల రూపాయల ఆదాయం ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైంది అన్నారు.

ముందుగా బీసీలపై ప్రేమ ఉంటే బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ 6000 కోట్ల విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాలలో 50 కోట్ల తో బీసీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పటివరకు ఒక్కదానికైనా శంకుస్థాపన చేయలేదని ఆయన తెలిపారు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా రెండవ దశ గుర్ల పంపిణీ ఏమైందని ఆయన నిలదీశారు ఐదు ఎకరాల భూమి ఈత వనాలకు ఇస్తామని గౌడ్ అన్నలకు ఇచ్చిన హామీ కూడా ప్రభుత్వం  నిలబెట్టు కోలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

బీసీల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ హామీలను మలు చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఓట్లు అడగాలని లేదా హామీలు నెరవేర్చకుంటే రేవంత్ సర్కార్ను బీసీ బిడ్డలు కూల్చడం ఖాయమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు