calender_icon.png 19 April, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం

19-04-2025 05:14:25 PM

సిపిఐ జిల్లా కార్యదర్శి...

బెజవాడ వెంకటేశ్వర్లు..

చిలుకూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం చిలుకూరు మండలం దూదియా తండా గ్రామంలో సిపిఐ పార్టీ గ్రామ శాఖ మహా సభను నిర్వహించారు. గ్రామ సభకు ముఖ్యఅతిథిగా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, పాల్గొని మాట్లాడుతూ... పేదల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పనిచేస్తుందని, ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ సిపిఐ పార్టీనే పోరాటాలు చేస్తుందని ప్రతి కార్యకర్త సిపిఐ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం 12, మందితో, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శిగా భూక్య వస్రం, సహాయ కార్యదర్శిగా మోహన్, కమిటీ సభ్యులుగా వీరభద్రరావు, ఎల్లమంద, నాగ, రమేష్, లక్ష్మణ్ నాయక్, నాగు, శ్రీను, స్వప్న, సుధా, తరంగిణి, ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దొడ్డ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.