calender_icon.png 29 December, 2024 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 10న మార్కెట్‌ను ప్రారంభిస్తాం

29-12-2024 01:53:59 AM

కరీంనగర్ సిటీ, డిసెంబర్ 28 (విజయక్రాం తి) : తెలంగాణ రాష్ర్టంలోనే అత్యుత్తమ మైన మార్కెట్ గా పద్మానగర్ సమీకృత మార్కెట్ ఉండబోతుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా శనివారం 16 వ డివిజన్‌లో కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ తో కలిసి మేయర్ యాదగిరి సునీల్ రావు మార్కెట్ ను సందర్శించారు. నగరపాలక సంస్థకు చెందిన 16. 50 కోట్లతో మాడ్రన్ మార్కెట్ చివరిదశ పనులను అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి తనిఖీ చేశారు. చివరిదశ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. జనవరి మొదటివారంలో పద్మానగర్ సమీకృత మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి చేస్తామన్నారు. కార్పోరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్, ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈ సుబ్రహ్మణ్యం, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.