calender_icon.png 25 November, 2024 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో రెడ్‌బుక్ ఓపెన్ చేస్తాం

25-10-2024 12:38:18 AM

  1. కాంగ్రెస్ లీడర్లను అక్రమ కేసులు బనాయించారు
  2. సర్కార్‌ను పడగొడతామంటేనే కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు
  3. మూసీపై సోషల్ మీడియాతో కేటీఆర్ దుష్ప్రచారం
  4. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్ హయాంలో అక్రమ కేసుల తో కాంగ్రెస్ లీడర్లను ఇబ్బందుల పెట్టిన వారి పేర్లను రెడ్‌బుక్‌లో ఎంట్రీ చేశామని, త్వరలోనే దాన్ని ఓపెన్ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నా రు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నేత గంగారెడ్డి హత్యఘటనతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బాధతో ఉన్నారని, అందుకే కొంత ఆవేదనతో మాట్లాడుతున్నారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అనుకోవడానికి అవకా శం లేదన్నారు.

ప్రభుత్వాన్ని పడగొడతామని కొందరు నాయకులు వ్యాఖ్యానించడం వల్ల వారి విధానాలు నచ్చక కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి, ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత కేడర్‌తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటన్నింటి ని పరిష్కరిస్తామన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్ లో చేరిక అంశాన్ని జీవన్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ నాయకుల ప్రోద్బలంతోనే గంగారెడ్డి హత్య జరిగిందని జీవన్‌రెడ్డి చెబుతున్నారని, కానీ అది వ్యక్తిగత కక్షతోనే జరిగిందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

పది నెలల్లో 50 వేల ఉద్యోగాలిచ్చాం.. 

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో 70వేల ఉద్యోగాలిస్తే.. తమ ప్రభుత్వం 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా విష ప్రచా రం చేస్తున్నారని, ఆ సోషల్ మీడియా దుబా య్, సింగపూర్ నుంచి నడుస్తోందని ఆయ న వివరించారు. మంత్రి పొంగులేటి దీపావళికి పొలిటికల్ బాంబు ఉంద న్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. ఆ బాంబు కోసం తానూ ఎదురు చూస్తున్నట్లు  బదులిచ్చారు.