* టచ్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. ఒకరి మృతి
మంచిర్యాల, జనవరి 31 :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్ర దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రా చెందిన ముత్తె రాజేశ్వరి(55) గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నది.
కుటుంబ సభ్యులు జనవరి 30వ తేదీసా టచ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆంజియోగ్రం చేసిన వైద్యులు రెండు గదులకు స్టంట్లు వేశారు. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రాజేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఆసుపత్రికి వచ్చిన తర్వాత డబ్బులు కట్టనిదే వైద్యం చేయమంటూ గంట పాటు వైద్యం అందించలేదని, డబ్బు కట్టిన తర్వాత కొద్ది సమయం తీసుకువస్తే బతికించేవారమని వైద్యులు పేర్కొనడంతో మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే వైద్యం అందిస్తే రాజేశ్వరి బతికేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులపై ఉన్న ఆసక్తి వైద్యం కోసం వచ్చిన వారిపై లేదని, డబ్బులు కట్టించుకొని వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారని, రాజేశ్వరి ఉదయమే చనిపోతే కేవలం డబ్బులు కట్టనిదే వైద్యం చేయం! డబ్బుల కోసం మధ్యాహ్నం వరకు కాలయాపన చేశారని మండిపడ్డారు.
మృతదేహాన్ని అప్పగించే పది నిమిషాల ముందు కూడా దాదాపు రూ.7,100 విలువైన మందులు తేవాలని చిట్టీలు రాసిచ్చారని, అవి తీసుకెళ్లి ఇస్తే ఆసుపత్రి కిందకు మృతదేహాన్ని పంపించి, చనిపోయిందని తెలుపారని ఆరోపించారు. అయితే ముందు జాగ్రత్తగా పోలీసులను సెక్యూరిటీగా తెప్పించుకోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రోదిస్తూ మృతురాలి బంధువులు తెలిపారు.