నిర్మల్ (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాలలను కించపరిచే విధంగా మాట్లాడడం మానుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ భక్తుల రంజిత్ అన్నారు. బుదవారం నిర్మల్ పట్టణంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీలో వర్గీభేదాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. పేదరికం ఆధారంగా ప్రభుత్వం ఎస్సీలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, నాయకులు బొడ్డు లక్ష్మణ్, రమేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.