మెదక్ జిల్లా (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంటలో మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినందుకు కేటీఆర్ సీఎంపై అనుచిత వాక్యాలు చేస్తున్నారని, కేటీఆర్ కి మతిభ్రమించిందని, అందుకే అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు, ఇప్పటికైనా కేటీఆర్ సీఎంపై అనుచితవాక్యాలు చేస్తే మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రికి తరలిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎంపై తప్పుడు మాటలు మాట్లాడితే సహించమని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మసాయిపేట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, మహేష్, ఎస్సిసెల్ అధ్యక్షులు నర్సిములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వినర్ మోహన్ నాయక్, సినియర్ నాయకులు కాషాబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.