నారాయణరెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తరు
కాంగ్రెస్ మంథని మండలాధ్యక్షుడు ప్రసాద్
మంథని, నవంబర్ 17 (విజయక్రాంతి): మంత్రి శ్రీధర్‌బాబు, ఆయన సోదరుడు శ్రీనుబాబులపై కాటారం మాజీ పీఏసీఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి నిరాధారణ ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అన్నారు.
కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు ముసుకుల సురేందర్‌రెడ్డితో కలిసి ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చల్లా నారాయణరెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే మంత్రి శ్రీధర్‌బాబు అని, అటువంటి శ్రీధర్‌బాబుపైన, అతని సోదరునిపైన నిరాధారణ ఆరోపణలు చేస్తున్న నారాయణరెడ్డికి కాటారం, మంథని ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.
రాజకీయ లబ్ధి పొందడానికే చల్ల ఆరోపణలు చేస్తూ మచ్చలేని మంత్రి శ్రీధర్‌బాబుపై, అతడి సోదరు డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. అనంతరం మంథని పోలీస్ స్టేషన్ లో చల్ల నారాయణరెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. వారివెంట పట్టణ అధ్యక్షుడు పోలు శివ, ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ ఉడత పర్వతాలు యాదవ్, సీనియర్ నాయకులు పెరవేణ లింగయ్య, పర్శవేణ మోహన్, మాజీ సర్పంచ్ దొరగొర్ల్ శ్రీనివాస్, మద్దెల రాజయ్య, తోకల మల్లేష్, ఎరుకల రమేష్‌బాబు, కోడి సురేష్, ఆగే రమేష్ ఉన్నారు.