25 May, 2026 | 4:24 AM

అన్నయ్య గౌడ్‌పై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

25-05-2026 12:00 AM

కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోబిన్ 

సుల్తానాబాద్, మే 24 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ ను విమర్శించే స్థాయి మీది కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోబిన్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి కిరణ్, దాసరి విజయ్, అంతటి అభినవ్ లు ధ్వజమెత్తారు. ఆదివారం వారు మాట్లాడుతూ గతములో 2 పర్యాయాలు సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచిగా పనిచేసి సు పట్టణాన్ని అభివృద్ధి పరిచి, పట్టణానికి ఎండ కాలంలో సైతం నీరు అందించిన ఘనత మా నాయకునిదనీ అన్నారు.

బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు అని వారు అన్నారు, అన్నయ్య గౌడ్ పై చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వారు తీవ్రంగా ఖండించారు, రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేసి మా నాయకుణ్ణి విమర్శిస్తే తిరిగి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి కిరణ్ ,దాసరి విజయ్, కామ సంజీవ్, అంతటి అభినవ్ గౌడ్, సామనపల్లి శివ, బొమ్మ సాయి, శ్రీమంతుల శివ, భగవాన్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.