- రేవంత్ రెడ్డి పాలన రామరాజ్యాన్ని తలపిస్తుంది
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, జనవరి 6 (విజయక్రాంతి): కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై రాష్ర్ట ప్రభుత్వం పై అనవసర ఆరోపణలు అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, ఇక కాంగ్రెస్ కార్య కర్తలు ప్రజలు ఊరుకోరని సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేం దర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం కరీం నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ పది సంవత్సరాల యినా చేయనోల్లు ఒకేసారి ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసి,
ఇచ్చిన మాట ప్రకారం అయిదు వందలు బోనస్ ఇచ్చి రెం డు పంటలకు కలిపి ఒకేసారి రైతు భరోసా ఇస్తుంటే ఓ్ంవలేక మాట్లాడుతున్న కెటిఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నా రు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలించడానికి గంగాధర మండలం వచ్చి నష్ట పరిహారం ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఇతనికి రైతుల గురించి మా ట్లాడే అరత ఉందా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు.
ఫార్ములా ఈ రేసులో ఏవన్ ముద్దాయిగా ఉండి విచారణకు సహకరించ కుండా పారిపోయాడని చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. రూపాయి నిధులు తేని బండి సంజయ్ కుమార్‌కు రైతు భరోసా పై భరోసా లేదన డం సిగ్గు చేటని, ప్రజలకు బండి సంజయ్ కుమార్ పై ఎటువంటి భరోసా లేకుండా అయ్యిందని పేర్కొన్నారు.
మల్టీపర్పస్ పార్క్ పనులు గాని స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు గాని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పనులు గాని రాష్ర్ట ప్రభుత్వ వాటా కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వడం వల్లే ఆగిపోయిన పనులు కొనసా గుతున్నాయని, బిఆర్‌ఎస్ నాయకులు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే ఇవన్నీ జరుగు తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నారని నరేందర్ రెడ్డి అన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొట్టుక పోయిన మానేర్ రివర్ ఫ్రంట్ చెక్ డ్యాంల నష్టపరిహరం కాంట్రాక్టర్ చెల్లించే విధంగా నివేదిక ప్రభుత్వానికి వెళ్లిందని,
త్వరలో కాంట్రాక్టర్ నుండి రికవరీ జరుగు తుందని అన్నారు. వేలం వేసి వదిలేసిన అంగారక టౌన్‌షిప్‌ను సుందరంగా తీర్చిది ద్దుతున్నామని, సుడా నిధులతో అభివృద్ధి చేపడుతున్నాం అని నరేందర్ రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో శ్రవణ్ నాయక్, కార్పొరే టర్ భూమాగౌడ్, నాయకులు ఆర్ష మల్లే శం, కాశేట్టి శ్రీనివాస్, మెండి చంద్రశేఖర్, గంట శ్రీనివాస్, ఆకుల నర్సయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జీడి రమేష్, జక్కుల మల్లేశం, కొట్టె ప్రభాకర్, వాడే వెంకట్ రెడ్డి, మేరాజ్, ఆశ్రఫ్, శేహెన్షా, పెద్దిగారి తిరుపతి, సుద ర్శన్, ఎల్లారెడ్డి, హనీఫ్, మహమ్మద్ భారీ, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.