- కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు పోరాటం చేస్తాం
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనను ఎగవేసే ప్రయ త్నం చేస్తే ఊరుకోబోమన్నారు. మంగళవా రం తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ర్ట నాయకులు, విశ్వకర్మ కుల సంఘాల నాయకులు ఆమె నివాసంలో కలిశారు. తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, ఈ ప్రభుత్వం కుల వృత్తులను కుదేలు చేస్తున్నదని విమర్శించా రు. అత్యధికంగా బీసీ విద్యార్థులు లబ్దిపొందే ఫీజురీయింబర్స్‌మెంట్, పూలే స్కాలర్ షిప్ పథకాల నిధుల విడుదలలో జాప్యం చేయడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిం చారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హయాం లో బీసీల కోసం అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని, ఇప్పుడు వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయ త్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటి వర కు బీసీ సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారని చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులు బొల్లా శివశంకర్ , తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ , దాసరి నరేశ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.