26-01-2025 12:28:54 AM
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
చేవెళ్ల, జనవరి 25 : గిరిజనుల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. శంకర్పల్లి మండలం కొండకల్ పరిధిలో బాధితులు చేపట్టిన దీక్షకు శనివారం రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ జి.మల్లేశ్ యాదవ్తో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండకల్, వెలిమల శివారు తండాలోని లంబాడా కుటుంబాలకు చెందిన 80 ఎకరాల బిలా దాఖలు భూము లను రియల్ ఎస్టేట్ కంపెనీలు కాజేయా లని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
బాధితులు తమ భూముల కోసం 15 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దీక్షలో రవి, శంకర్, బాబు, బాలు, శంకరమ్మ, రెడ్యా లక్ష్మణ్, గోపాల్, చందర్, మోహన్, లక్ష్మణ్, గోమా, బాల్రాజు, నహీం, సుధాకర్, నర్సింహా చారి, మల్లేశ్, కొండకల్ మాజీ వార్డు సభ్యుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మర్రివాగు రాజు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత జన్మదినం
శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత జన్మదినం సందర్భంగా మియాపూర్ డివిజన్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అరణ్యభవన్ లోని ఆమె ఛాంబర్‌లో కలసి కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కి ఆమె మరిన్ని విశిస్టమైన సేవలు అందించాలని, ప్రజా సమస్యలపై అనర్గళంగా మాట్లాడి వాటినీ పరిష్కరించి, మహిళా నాయకురాలిగా తెలంగాణకు తలమానికంగా నిలవాలని ఆకాంక్షించారు. మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దోర్నాల రవికుమార్ గౌడ్, మియాపూర్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రాయికోటి శ్రీకాంత్, నరేష్ యాదవ్‌పాల్గొన్నారు.