21-02-2025 12:42:31 AM
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్
కోదాడ, ఫిబ్రవరి 20: తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిలపైన అబద్ధపు ప్రచారాలు చేస్తే సహించేది లేదని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపమ్మ సుధీర్ హెచ్చరించారు.
గురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మెంబెర్స్ కలిసి సమావేశం లో మాట్లాడుతూ గడిచిన 30 సంవత్సరాల నుండి కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజ ల అభివృద్ధి కోసం వారి జీవితాలను అంకితం చేసి ఎక్కడ అవినీతి లేకుండా నీతి నిజాయితీగా రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్న వారిపై విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు.
వైస్ చైర్మన్ బషీర్, మల్లు వెంకట్ రెడ్డి, గునుగుంట్ల శ్రీనివాస రావు, పొలంపల్లి వెంకటేశ్వర్లు, రాపాలి శ్రీను, చింతకుంట్ల సూర్యం, తమ్మనబోయిన వీరబాబు, జొన్నలగడ్డ మణెమ్మ, దొంగల నాగ వేణు, పోతుగంటి అభిరామ్ పాల్గొన్నారు