calender_icon.png 28 April, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత పౌరుల జోలికొస్తే ఊరుకోం

26-04-2025 12:00:00 AM

ముస్లిం మతపెద్దలు, నాయకులు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,ఏప్రిల్ 25(విజయ క్రాంతి): భారత పౌరుల జోలికి వస్తే ఊరుకునేది లేదని  జామా మస్జిద్ ఇమామ్ మొహమ్మద్ అయాజ్ అష్రఫీ, నాయకులు అబ్దుల్ ఫయాజ్, అబ్దుల్ రహమాన్ అన్నా రు. కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడికి ఖండిస్తూ శుక్రవారం జామా మసీదు, హుదా మస్జీద్‌లలో నమాజ్  అనంతరం  నల్ల బ్యాడ్జీలు ధరించి నమా జ్ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయకులైన భారత పౌరులపై ఉగ్రవాదులు దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొంతమంది ఇస్లాంకు చెడు పేరు తేవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. సమైక్యతకు నిదర్శనం భారతదేశమన్నారు. భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ప్రతి ఒక్క భారత పౌరుడు ఈ దాడికి ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు షబ్బీర్, సాజిద్, సాలం, ఎండి అహ్మద్, తాజ్, ఇమ్రాన్, లాయక్ హుస్సేన్ , షాహిద్ హుస్సేన్, అఖిల్, ముబాషిర్, నజీర్, గులాం జవిద్, అబ్దుల్లా బిన్ ఉమర్, మోసిన్ బిన్ అమర్, అవున్ బిన్ అలీ, ఖాళీద్ బిన్ అబ్దుల్లా, హసన్ బిన్ ఖలీద్, అఖిల్ ,యువకులు తదితరులు పాల్గొన్నారు.