calender_icon.png 29 March, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ భూముల్లో ఇంచు కూడా తీసుకోం

25-03-2025 12:18:33 AM

  1. హైడ్రాకు రియల్ ఎస్టేట్‌కు సంబంధం లేదు
  2. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): హైడ్రాకు, రియల్ ఎస్టేట్ పడిపోవడానికి సంబంధం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటివరకు ప్రజావాణి, పబ్లిక్ గ్రీవెన్స్‌లో భూమి కబ్జాకు సంబంధించి 9,078 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

అందులో హైడ్రా 7,249 పరిష్కారమైనట్లు చెప్పారు. పరిష్కారమైన వారిలో మెజార్టీ ప్రజలు నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదని వివరించారు. బెంగళూరు, ముంబై..సహ పలునగరాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. హైడ్రాతో పేదలకు న్యాయం జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే, హెచ్‌సీయూ భూములపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు.

హెచ్‌సీయూ భూముల్లో తమ ప్రభుత్వం ఇంచు కూడా తీసుకోబోదని చెప్పారు. అక్కడ  ఉన్న చెరువులు, ప్రకృతికి ఎలాంటి ఆటంకం కలగబోదని స్పష్టం చేశారు. తానతో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా అక్కడే చదువుకున్నామని, ఆ భూములకు వచ్చిన ఢోకా ఏమీ లేదని భరోసా ఇచ్చారు.