03-04-2025 09:48:07 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వం హెచ్‌సీయూ(HCU) భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు(BJYM District President) నంది వేణు(Nandi Venu) హెచ్చరించారు. హెచ్‌సీయూ విద్యార్ధులపై లాఠీఛార్జ్(Lathi charge), బీజేవైఎం నాయకులపై పోలీసుల(Police) తీరును నిరసిస్తూ గురువారం నిజాంసాగర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా విఫలమైందన్నారు. వర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ఎన్ని ఉద్యమాలైనా చేస్తామన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు విపుల్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, నాయకులు భరత్, లక్ష్మిపతి, రాజేష్, రాజగోపాల్, సురేష్, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.