calender_icon.png 19 March, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ దుస్థితి హైదరాబాద్‌కు రానివ్వం

18-03-2025 01:47:16 AM

  1. సిటీలో డీజిల్ ఆటోలకు అనుమతి ఇవ్వడం లేదు 
  2. శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): కాలుష్యంతో ఢిల్లీ అల్లాడిపోతోం దని, అక్కడి ప్రజలు ఒక సీజన్‌లో మూడు నెలల పాటు వలస వెళ్లిపోతున్న దుస్థితి ఉందని, ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకు ండా చూస్తామని డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార్క మల్లు స్పష్టం చేశారు. అందుకే ఎలక్ట్రిక్, బ్యాటరీ బస్సులు ప్రవేశపెడుతున్నామ ని, డీజిల్ బస్సులను రాష్ర్టంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.

సిటీలో కొత్తగా డీజిల్ ఆటోలకు అనుమతి ఇవ్వడం లేదని, బ్యాటరీతో నడిచే ఆటోలను ప్రోత్సహిస్తున్నాన్నారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై మండలిలో ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, మహేశ్‌కుమార్‌గౌడ్, కల్వకుంట్ల కవిత, భానుప్రసాద్ ప్రశ్నలకు డిప్యూ టీ సీఎం సమాధానం ఇచ్చారు. 

రాష్ట్రానికి తక్కు వ ధరతో, కాలుష్య రహితంగా విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా సమగ్ర గ్రీన్ పవర్ పాలసీని తీసుకొచ్చామన్నారు. దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్‌బాబుతో ఒప్పందం చేసుకున్న కంపెనీలు క్షేత్రస్థాయిలో సర్వే చేసుకుంటున్నట్లు వెల్లడించారు. సర్వే తదుపరి రాష్ర్ట ప్రభుత్వానికి డీపీఆర్ సమ ర్పిస్తారని తెలిపారు. 

ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగాయ్..

రాష్ర్టంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రిజిస్ట్రేషన్‌లో టాక్స్ ఫ్రీ చేశామని ఫలితంగా రాష్ర్టంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగాయని భట్టి పేర్కొన్నారు. ఎవరైనా ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్‌లు పెట్టుకునేందుకు ముందుకొస్తే అన్ని అనుమతులను ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు.

2030 నాటికి 20,000 మెగావాట్లు, 2040 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడించారు. గ్రీన్ పవర్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సింగిల్ విండో పద్ధతుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు బ్యాంకుల సహకారంతో స్వయం ఉపాధికి గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందన్నారు.