18-03-2025 12:28:09 AM
డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి
ఎల్బీనగర్, మార్చి 17: మన్సూరాబాద్ డివిజన్ అభివృద్ధి విషయంలో ఎవరూ అడ్డుపడినా ఉపేక్షించేది లేదని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా కావాలనే బీఆర్‌ఎస్ నాయకులను రెచ్చగొడుతూ కుటిల రాజకీయాలకు పాల్పడుతు న్నారని జీహెచ్‌ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం మన్సూరాబాద్ డివిజన్‌లో వివిధ కాలనీల్లో రూ. 60 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్ లతోపాటు మంజూరైన అభివృద్ధి పనులను కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి, వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు, సభ్యులతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
సరస్వతి నగర్ కాలనీలో రూ, 18 లక్షలతో సీసీ రోడ్డు, వీరన్న గుట్టలో రూ, 10.50 లక్షలతో సీసీ రోడ్లు, పార్క్ స్థలంలో రూ, 10 లక్షలతో ఓపెన్ జిమ్, విజయనగర్ కాలనీలో రూ, 21.50 లక్షలతో వాటర్ స్ట్రాగేషన్ పాయింట్, సీసీ రోడ్డు పనులకు శంకు స్థాపన చేశారు.
కార్యక్రమంలో కాలనీ సంక్షే మ సంఘాల అధ్యక్షులు ధర్మా రావు, నర్సిం హ యాదవ్, కడారి యాదగిరి, రోహిత్ పరంకుశం, కోటయ్య, రవి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు హరీశ్ రెడ్డి, రామేశ్వర్, ఆదినారాయణ, కొండల్ రెడ్డి, యాంజల జగన్, కృష్ణ రెడ్డి, శ్రీధర్ గౌడ్, బాలాజీ నాయుడు, లింగాచారి, సాయిరామ్ గౌడ్, శ్యామ్ సుందర్ రెడ్డి, రమేశ్ చారి, నక్క సాయి దీప్, చంద్రశేఖర్ రెడ్డి, రమణా గౌడ్, సోమనాథ్, మోహన్ రెడ్డి, జయతేజ, మాధవి, మంగా రెడ్డి, సంపత్ గౌడ్, రోహిత్ రెడ్డి, గోపి, పుట్ట వెంకట్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.