calender_icon.png 27 January, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ పేరున ఒక్క ఇల్లూ ఇవ్వం X దిగజారుడు రాజకీయం

26-01-2025 01:18:32 AM

ఇందిరమ్మ పేరున ఒక్క ఇల్లూ ఇవ్వం

  1. కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో ఉండాల్సిందే
  2. లేదంటే కేంద్రమే నేరుగా బియ్యం ఇస్తుంది
  3. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, జనవరి 25 (విజయక్రాంతి): ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడతామంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయబోమ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యా ఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఉచితం గా బియ్యం పంపిణీ చేస్తుంటే రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డు లపై సీఎంతోపాటు పీఎం ఫొటో కూడా పెట్టవలసిందే అన్నారు. మోదీ ఫొటో పెట్టనప్పుడు రాష్ట్రానికి ఉచిత బియ్యం ఎందుకు సరఫరా చేయాలని ప్రశ్నించారు.

ప్రధాని ఫొ టో పెట్టకుంటే కేంద్రమే నేరుగా బియ్యం ఇచ్చే ఆలోచన చేస్తుందని చెప్పారు. కరీంనగర్‌లో శనివారం నగర మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లు లెంకల స్వప్నవేణు, శ్రీదేవిచంద్రమౌళి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..

దావోస్ వేదికగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులపై ఎంవోయూలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారమంతా హంబక్ అని కొట్టిపారేశారు. బీజేపీలో చేరతామని చాలామంది వస్తున్నారని, కబ్జాకోరులను తమ పార్టీ చేర్చుకోబోమని తెలిపారు.

కేంద్రం నుంచి నిధులు తెచ్చినా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్‌ఎస్ తనను అభివృద్ధి పనులకు పిలువలేదని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధుల దారి మళ్లింపుపై తాను కొట్లాడటంతో కేసీఆర్ తిరిగి మంజూరు చేశారని గుర్తు చేశారు.

దిగజారుడు రాజకీయం

  1. ఇందిరాగాంధీ త్యాగం ముందు బీజేపీ ఎంత?
  2. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్

హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): పీఎం ఆవాస్ యోజన పేరుతో కేంద్రమిచ్చే ఇండ్లకు ‘ఇందిరమ్మ’ పేరుపెడతానంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వమంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. బండి సంజయ్ చేసి న వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శమని, తెలంగాణ సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ త్యాగం ముందు బీజేపీ ఎంత అంటూ ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వడం ఒక బాధ్యత అని, రాష్ట్ర ప్రజలు కూడా కేంద్రానికి పన్నులు చెల్లిస్తారనే విషయాన్ని కేంద్రమంత్రి తెలుసుకోవా లని  హితవు పలికారు.

కాంగ్రెస్ చేతల ప్రభు త్వం అని చెప్పడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శమని, తెలంగాణ ఏర్పాటు తర్వాత రికార్డుస్థాయిలో  లక్షా 78 వేల 959 కోట్ల పెట్టుబ డులు రావడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ ఒక్క ఉద్యోగమిచ్చిన పాపాన పోలేదని, రా ష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు.

తెలంగాణ  ప్రజల పదేళ్ల నిరీక్షణ ఇంది రమ్మ ఇళ్లతో తీరబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ల పక్షపాతి అని, ఆర్థిక పరిస్థితి బాగొలేకున్నా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల హయాం లో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో పాలన సాగుతోందన్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభం కాబోతున్నాయని, ఇది రాష్ట్రంలోని పేదలందరికీ పెద్ద పండుగ అని మహేశ్‌కుమార్‌గౌడ్ వివరించారు. బీఆర్‌స్ నే తలకు కనువిప్పు కలిగేలా కాంగ్రెస్ పాలన ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత లు చేస్తున్న విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించిట్టు ఉన్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ నాలుగు ముక్కులు కావడం ఖాయమని, ఆ పార్టీలో తండ్రీకొడు కు తప్ప ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు.