calender_icon.png 3 April, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ భూముల జోలికి వస్తే ఊరుకోం

02-04-2025 12:00:00 AM

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఆదిలాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ ముల జోలికొస్తే ఊరుకునేది లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేశ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఆఫీస్  ఎదుట రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా గణేష్ మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వ హైదరాబాద్ సెంట్ర ల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలను వేలం వేసి ఇతర ప్రైవేట్ కార్పొరేటు కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారని, మా భూములు మాకు కావాలనీ శాంతి యుతంగా ధర్నాలు చేస్తుంటే విద్యార్థుల పైన పోలీసులు లాఠీచార్జి చేస్తూ, అరెస్టు చేయడం సరికాదన్నారు.

రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తోందా లేక ప్రైవేట్ కార్పొరేటు పాలన నడుస్తోందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్నాక్ సక్కు, సాయి ప్రితం, యమున, రమ్య, దివ్య, అఖిల్, కళ్యాణ్ రామ్ పాల్గొన్నారు.