బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి...
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కర్ణాటక తరహాలో ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని మోసగించి విస్మరించిందని ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి(BRS state leaders Nagam Shashidhar Reddy) అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలలో ఫ్రీ బస్సు తప్పితే ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు.
రుణమాఫీ, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి వంటి వాటిని కంటితుడుపుగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులను కూడా మోసగించారని మండిపడ్డారు. కేవలం సర్వేల పేరుతో కాలయాపన చేసి హామీలను విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోసపూరిత ఆరు గ్యారెంటీలలో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడతామన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ నాయకులు అర్ధం రవి, బాలాగౌడ్, లక్ష్మయ్య, భీముడు, శ్రీశైలం, పాండు, శంకర్, భాష, పాషా తదితరులు ఉన్నారు.