calender_icon.png 17 April, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్, జార్జిరెడ్డి ఆశయాల సాధనకు ముందుకు సాగుతాం

15-04-2025 12:16:41 AM

అరుణోదయ గౌరవ అధ్యక్షురాలు విమలక్క

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్, మతోన్మాదుల చేతిలో దారుణ హత్యకు గురైన విప్లవ ధ్రువతార జార్జిరెడ్డి ఆశయాల సాధనకు ముందు కు సాగుతామని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురా లు విమలక్క పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి, జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా సోమవారం అరుణోదయ కార్యాలయంలో స్మృతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా విమలక్క, పీడీఎస్(విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి విజయ్ మాట్లాడారు.

మతోన్మాదం సమాజాన్ని విభజిస్తూ కుల, మత విద్వేషాలు ప్రదర్శిస్తున్నపుడు పీడిత వర్గ, కుల ఐక్యతను చాటడానికి అంబేద్కర్, జార్జిరెడ్డి త్యాగాలను స్మరించుకోవాలన్నారు. వర్గపోరాటాలు, కుల నిర్మూలన పోరాటాల ఐక్యతను చాటుతూ ఏప్రిల్ నెలను సామాజిక విప్లవ మాసంగా పాటిద్దామని పిలుపు నిచ్చారు. అంతకుముందు ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డి మెమోరి యల్ వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి పల్లె లింగన్న, గంగారత్నం, బుల్లెట్ వెంకన్న, సంధ్య, జంట నగరాల అధ్యక్ష కార్యదర్శులు రాకేష్, సురే ష్, పీడీఎస్‌యూ నేతలు పాల్గొన్నారు.