calender_icon.png 22 January, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనాభివృద్ధికి సీఎంను కలుస్తాం

01-09-2024 12:38:53 AM

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయ క్రాంతి): త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి గిరిజనాభివృద్ధికి చేపట్టాల్సిన పథకాలపై వినతిపత్రం అందజేస్తామని గిరిజన ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. శనివారం  మాసాబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో ట్రైకార్ చైర్మన్ డాక్టర్ తేజనాయక్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రభు త్వ విప్ రామచంద్రునాయక్, ఎంపీ  బలరాంనాయక్,  ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, బాలునాయక్, తెల్లం వెంకట్రావ్, మురళీనాయక్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, జారే ఆదినారాయణ, రాందాస్‌నాయక్ పాల్గొన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ.360 కోట్లతో  అభివృద్ధి పనులనను ఎలా చేయాలో సూచనలు చేశారు.