రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాం తి)/ రాజేంద్రనగర్, ఆగస్టు 14 : మహిళలను లక్షాధికారులను చేయడమే ధ్యేయంగా తమ ప్రభు త్వం పనిచేస్తున్నదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. రాజేం ద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసా య విశ్వవిద్యాలయంలో బుధవారం స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 11వ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
మహిళా సంక్షేమ పథకాలను ఎగతాళి చేస్తున్న వారికి మహిళలే బుద్ధి చెప్పాలన్నారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో సర్కార్ ముందు కు సాగుతుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. స్త్రీ నిధి సంఘాల సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం శిల్పారామంలో ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేశామ న్నారు. దీంతో పాటు విద్యార్థినుల యూనిఫా మ్స్ సిద్ధం చేసే బాధ్యతలనూ అప్పగించామన్నారు.
ప్రతిచోటా పోలీసులు మహిళలకు భద్రత కల్పించడం సాధ్యపడకపోవచ్చన్నారు. మహిళా సంఘాలు క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. త్వరలో మార్పు పేరు తో కొత్త డ్రైవ్ ప్రవేశపెడతామన్నారు. మహిళల భద్రత, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బ్యాంక్ మెట్లేక్కాలంటే భయపడే స్థితి నుంచి బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలకే రుణాలిచ్చే స్థాయికి మహిళా సంఘా లు ఎదిగాయని కితాబిచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో పాపాలను తమ ఖాతాలో వేయాలని కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.