calender_icon.png 31 October, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ లోటు తీర్చుకుంటాం

31-10-2024 12:39:45 AM

సిడ్నీ: ఈ ఏడాది జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తప్పకుండా విజయం సాధిస్తామని ఆసీ స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఈ సారి భారత్‌పై టెస్టు సిరీస్ విజయం అందుకునేందుకు ప్రయత్నిస్తా. స్వదేశంలో ఆడేటపుడు నాతో పాటు మిగతా ప్లేయర్లు గెలవాలని కోరుకుంటారు. గత 16 టెస్టు సిరీస్‌లలో అన్ని జట్లను ఓడించాం.

కానీ భారత్‌ను మట్టికరిపించలేకపోయాం. ఈ సారి తప్ప కుండా గెలిచేందుకు ప్రణాళికలు రచి స్తాం’ అని కమిన్స్ తెలిపాడు. ఆసీస్ ప్రధాన కోక్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడగిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది.