calender_icon.png 26 January, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా మారుస్తాం

27-08-2024 12:00:00 AM

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): భవిష్యత్‌లో రాష్ట్రాన్ని క్రీడారం గంలో నంబర్‌వన్‌గా నిలపడమే ప్రభుత్వ ల   క్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నా రు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సోమవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగా ణ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్, టీషర్ట్‌లను మంత్రి పొన్నం.. స్పీకర్ గడ్డం ప్రసా ద్‌తో కలిసి ఎల్బీ స్టేడియంలో ఆవిష్కరించా రు. పొన్నం మాట్లాడుతూ.. ఇటీవల కొరి యా దేశం వెళ్లినప్పుడు అక్కడి క్రీడా సంస్థ లు, ఆటగాళ్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సలహాదారుడు జితేంద ర్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.