calender_icon.png 1 April, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం

31-03-2025 01:38:43 AM

శీతల పానీయాలు వద్దు, సహజ పానీయాలు ముద్దు

మానుకోట ఎమ్మెల్యే  డాక్టర్.మురళీ నాయక్

 మహబూబాబాద్. మార్చి.29: (విజయ క్రాంతి) జన విజ్ఞాన వేదిక, జమయత్ ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక కరపత్రం విడుదల చేశారు.  మహబూబ్ జిల్లా ప్రజలకు విశ్వవసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పక్షుల కుహకుహలు మాయమవుతున్న వేళ... షడ్రుచులు జీవన మాధుర్యాన్ని నింపుతూ... విశ్వమంంచిన తాకుతున్న విద్వేషాల పిచ్చిని చెరుపుతూ... పరస్పరం మానవనీయ బంధాల మట్టి పరిమళం పెద్ద జల్లే ఆకాంక్షలతో ఉగాది ఆహ్వానిస్తూ మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజం అందించాలని ప్రేమ ఆప్యాయతలు పంచాలన్నారు.

ఇప్పడు తయారు చేస్తున్న కూల్డ్రింక్స్ సహజ సిద్ధంగా లేవు... సింథటిక్ మెటీరియతో తయారు చేయడం వల్ల చిన్న చిన్న పిల్లలు చిన్న వయసులో  అనేక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం .సహజ పానీయాలు లేదా పండ్లను తీసుకుందాం అంతే కాకుండా మహబూబాబాద్ పట్టణం నుండి ప్లాస్టిక్ ని తరిమి వేద్దాం మొన్న మున్సిపాలిటీ సభలో తీర్మానం కూడా చేశాం.దీన్ని పూర్తి స్థాయిలో తొందరలోనే అమలు చేస్తాం ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు