calender_icon.png 8 January, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలోనే అగ్రగామిగా నిజామాబాద్ మార్కెట్ యార్డ్ నిలబెడతాం

07-01-2025 08:36:51 PM

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి...

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ను అగ్రగామిగా నిలబెడతాం, మార్కెట్ కు వచ్చే మహిళా రైతులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తాం, అధిక లాభాల కోసం ఎండిన పసుపు మాత్రమే మార్కెట్ కు తరలించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy) అన్నారు. దేశంలోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు ఎంతో ప్రాముఖ్యత ఉందని తమ ప్రభుత్వం నిజామాబాద్ మార్కెట్ యార్డును దేశంలోని ఉత్తమమైన మార్కెట్ యార్డ్ గా నెలకొల్పే దిశగా కృషి చేస్తుందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును సుదర్శన్ రెడ్డితో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు, పర్యటించి వ్యవసాయ మార్కెట్ అధికారులు మార్కెట్కు వచ్చే రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

అతిగా ఆశపడి పూర్తిగా ఎండని పసుపును మార్కెట్ యార్డ్ కు తరలించవద్దని రైతులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచించారు. దానివల్ల రైతులే నష్టపోతారని ఆయన అన్నారు. దేశంలోనే ప్రముఖమైన మార్కెట్ యార్డుగా పేరోందిన నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కు ఈ నామ్ పేరు వచ్చిందని ఇక్కడ రైతులు వారు పండించిన ధాన్యాన్ని విక్రయిస్తే అధిక లాభాలతో పాటు వ్యవసాయం పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. గతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ నామ్ వ్యవస్థను ప్రవేశపెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మార్కెట్ యార్డుకు వారు తెచ్చిన ధాన్యానికి ఎలాంటి గిట్టుబాటు లేకుండా నష్టం చేకూర్చారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా తమ ప్రభుత్వంలో త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసి, కూరగాయలు పండించే మహిళా రైతుల కోసం అన్ని వస్తువులతో కూడిన ప్రత్యేక షెడ్యూల్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఐసిడిసిఎంఎస్ చైర్మన్ తారచంద్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.