calender_icon.png 29 March, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండ జిల్లాను నంబర్ 1గా మారుస్తాం

24-03-2025 01:10:58 AM

  1. 2000 కోట్లతో ఉమ్మడి జిల్లాలో రోడ్లు
  2. ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం
  3. సాగర్ ఆయకట్టులో రబీ సీజన్‌లో చివరిగింజ చేతికి వచ్చే వరకు నీరు అందిస్తాం
  4. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలేక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

హుజూర్ నగర్, మార్చి 23: ఉగాది నుండి రాష్ట్ర వ్యాప్తంగా  ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యంఉచితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్నగర్ పట్టణం నుండి పంపిణి ప్రారంభిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఆదివారం పాలకవీడు మండలం జానపహాడ్ లోని దర్గా దర్శించుకొని డేక్కన్ సిమెంట్ అతిధి గృహం నందు రాష్ట్ర ఆర్ & బి, సినిమాటోగ్రఫీ   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి జిల్లా అభివృద్ధి పై చర్చించారు.అనంతరం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రెస్ మీట్ ద్వారా వివరించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో వేలకోట్లు ఖర్చు పెట్టి దొడ్డు రకం బియ్యం ఇవ్వటం తో వాటిని తినకుండా కోళ్ల ఫారాలకి, బీర్ల కంపెనిలకి, రీ సైకిలింగ్,కాకినాడ పోర్ట్ ద్వారా అక్రమంగా తరలించి దుర్వినియోగ పర్చారని అందుకే ప్రజల కొరకు ప్రతి ఒక్కరు సన్న బియ్యం తినేలా సోనియాగాంధీ  నాయకత్వం లో ప్రవేశ పెట్టిన ఆహార భద్రత చట్టాన్ని పటిష్ట పరుస్తూ తెలంగాణ లోని 3.2 కోట్ల మందికి(84 శాతం) కడుపు నింపేలా ఉగాది నాడు ప్రారంభించి ఏప్రిల్ నెల నుండి ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యం అందిస్తామని తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో అన్ని సాగునీటి ప్రాజెక్ట్ లకి ప్రాధాన్యత నిస్తూ అనుకున్న సమయానికి పూర్తి చేసి జిల్లాను సస్య శ్యామలం చేస్తాం అని తెలిపారు. ఎస్ యల్ బి సి, డిండి ప్రాజెక్ట్, నెల్లికల్లు,నాగార్జున సాగర్ ఎడుమ కాల్వ కి మరమ్మత్తు లు,ఎ యమ్ ఆర్ కి మరమ్మతులు చేపిస్తామని ఇటీవలే గంధమల్ల కి క్యాబినెట్ ఆమోదం పొందామని త్వరలో పనులు ప్రారంబిస్తామని తెలిపారు.

కృష్ణ నదిలో నీటి కొరతకు కారణం గత ప్రభుత్వమే అని 512 టి యమ్ సి లు ఆంధ్రకి ఇచ్చి, 299 టి యమ్ సి లకి మాత్రమే తెలంగాణ కి వచ్చేలా  ఒప్పందం చేసికున్నారని, అలాగే పోతిరెడ్డిపాడు కేపాసిటి పెంచిన, ముచ్చికల్లు వద్ద డబుల్ నీళ్లు ఆంధ్ర వారు తరలించెందుకు గత ప్రభుత్వ పాలకులు సహాయం చేసారని మేము వచ్చాక క్రిష్ణ నది బోర్డు మేనేజ్ మెంట్ తో మాట్లాడు తూ తెలంగాణ వాటాని పెంచేవిదంగాపోరాడుతున్నామని తెలిపారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్ తయారు చేసి 5 టి యమ్ సి ల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి తరలించి ఎడమ కాల్వ, ఎ యమ్ ఆర్ ద్వారా నీరు విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు రబీ సీజన్ లో వేసిన  ప్రతి వరి గింజ ఇంటికి చేరేంతవరకు సాగు నీరు అందిస్తామని తెలిపారు.  

తుంగతుర్తి నియోజకవర్గానికి నీరు: మంత్రి కోమటిరెడ్డి 

ఉమ్మడి జిల్లాలో 2000 కోట్లతో పలు రోడ్లు నిర్మించి ఉమ్మడి జిల్లాను అభివృద్ధి లో నెంబర్ 1 గా ఉంచుతామని వివరించారు. ఎస్ ఎల్ బి సి సొరంగం ని గతంలో వైయస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రారంభించి 30 కి మి లు పూర్తి చేశామని తదుపరి వచ్చిన ప్రభుత్వం పదేళ్లు కాళేశ్వరం పేరుతో కాలయాపన చేసి మిగిలిన ప్రాజెక్ట్ లను వదిలేసారని మా ప్రభుత్వం రాగానే యస్ యల్ బి సి సొరంగం నిర్మాణం పూర్తి చేయుటకు అమెరికా వెళ్ళి ర్యాబిస్ కంపెనీ తో చర్చించి పనులు ప్రారంభించామని, కానీ పనుల్లో సొరంగం కూలడం దురదృష్టం అని, బ్రహ్మణవెళ్ళoలకి 200 కోట్లు పదేళ్లు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచారని మేము రాగానే పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించా మని తెలిపారు.

సోమవారం యస్ యల్ బి సి పనులపై ముఖ్యమంత్రి తో సమావేశం లో ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేవాదుల ద్వారా సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాలకి నీరు ఇస్తామని తెలిపారు.1000 కోట్లతో రైల్వే బ్రిడ్జ్ లు,140 కోట్లతో దామరచెర్ల వద్ద బ్రిడ్జి నిర్మెంచేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అనుమతి ఇచ్చారని తెలిపారు.గత పాలకులు10 టి యమ్ సి ల నీరు జగన్ మోహన్ రెడ్డి కి తాకట్టు పెట్టి నీరుతర లించేలా సహకరించరని అన్నారు.

మేము గెలిచిన రోజు నుండి ఇంట్లో ఉండకుండా ప్రజల మధ్యలో ఉంటూ అభివృద్ధి, సంక్షేమం పై నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో నల్గొండ ఎంపీ రఘు వీర్ రెడ్డి,ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, బి లక్ష్మా రెడ్డి, జై వీర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,మందుల సామెల్, వేముల వీరేశం, బాలు నాయక్,బీర్ల ఐలయ్య, అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీశంకర్ నాయక్, మదర్ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.