calender_icon.png 30 November, 2024 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూర్‌నగర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

30-11-2024 02:02:03 AM

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హుజూర్‌నగర్, నవంబర్ 29: రాష్ట్రంలోనే హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దు తానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలను పరిశీలించి, ప్రిన్సిపాళ్లను మౌలిక సదు పాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాలలో నూతన గదులు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ కల్పిస్తానన్నారు.

ప్రైవేట్‌కు ధీటుగా హుజూర్‌నగర్ డిగ్రీ కళాశాలను మార్చుతానని చెప్పారు. ఆయ నవెంట కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ము న్సిపల్ చైర్‌పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ సంపత్‌రెడ్డి ఉన్నారు. గరిడేపల్లి నుంచి అలింగాపురం వర కు రోడ్డు పనులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

నేరేడుచర్ల మున్సిపాలిటిలో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమి టీ పాలక మండలితో సమావేశం అయ్యారు. మంత్రి వెంట కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చినవెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రకాశ్, వైస్ చైర్మన్ అలక సరితసైదిరెడ్డి, మార్కె ట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మీనరసింహారావు, మాజీ ఎంపీపీ గోపాల్ ఉన్నారు.