calender_icon.png 26 November, 2024 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిని ధనిక జిల్లాగా మార్చుతాం

26-11-2024 01:46:14 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే కాకుండా ధనిక జిల్లాగా తీర్చిదిద్దడ మే తమ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నా రు. సోమవారం కొత్తగూడెం పర్యటనలో భాగం గా నందతండా నుంచి దివ్యాంగుల కాలనీ వరకు రోడ్డు పనులను ప్రారంభించారు. కొత్తగూడెంలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

అన్ని వనరుల నిలయంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యారంగానికి ప్రాధాన్యమిస్తూనే, వైద్యం, రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామ న్నారు. కొత్తగూడెం నుంచి ఇల్లెందు మీదు గా హైదరబాద్‌కు జాతీయ రహదారిని అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొ న్నారు. పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వేలైన్ ఏర్పాటు కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపడితే సింగరేణి, నవభారత్, బీటీపీఎస్, ఐటీసీ, హెవీవాటర్ ప్లాంట్ వంటి పరిశ్రమలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కు వ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. కొత్తగూడెం రింగ్‌రోడ్డుకు రూ.400 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రియాజ్, ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా ఖమ్మంలోని ఖానాపురం హవేలీ నాల్గవ డివిజన్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జీప్లస్ వన్ భవన నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మేయర్ నీరజ, కార్పొరేటర్లు దండా జ్యోతిరెడ్డి, కమర్తపు మురళి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కళావతి పాల్గొన్నారు.