- ప్రజల సమస్యలు పట్టించుకోని మున్సిపాలిటీ ఎందుకు?
నెలల తరబడి మున్సిపల్ కమిషనర్ రాకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది?
భూత్పూర్ మున్సిపాల్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, నాయకులు
ఎస్సై చంద్రశేఖర్ చొరవతో కార్యాలయం తాళం తీసి నిరసన తెలిపిన కౌన్సిలర్లు
మహబూబ్ నగర్, జనవరి 20 (విజయ క్రాంతి): ప్రజల సమస్యలు పట్టించుకో కుంటే ప్రభుత్వ కార్యాలయం అయితే ఏమి టి గొప్ప అని... అసలు కార్యాలయాలు ఉన్న ది ప్రజల సమస్యలు పట్టించుకునేందుకు అధికారులకు ఇన్చార్జిలు ఇచ్చి కాలం గడి పేందుకా అంటూ కౌన్సిలర్లు మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మున్సిపాలిటీ కార్యాలయానికి తాళం వేసి గేటు ముందు కూర్చుని సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
నెలలు తరబడి మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో ఇంచార్జిగా జడ్చర్ల మున్సిప ల్ కమిషనర్‌గా లక్ష్మారెడ్డికి ఇవ్వగా ఆ అధికా రి వచ్చింది ? పోయింది? ఎవరికి తెలవడం లేదని ఆందోళన చేపట్టారు. దాదాపు గంట సమయం పైగా కార్యాలయానికి తాళం వేసి భూత్పూర్ మున్సిపల్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భూత్పూర్ మున్సిపాలిటీ లో సేకరణకు సంబంధించిన ట్రాక్టర్ రిపేరుకు వెళ్లి నెలలు గడుస్తున్నా తిరిగి రావడం లేదని, సంబంధిత అధికారి రిపేరు డబ్బులు చెల్లించకపోవడమే కారణ మన్నారు. ఇన్చార్జి పాలనలో అధికారులను ఉంచి, ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు.
ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లే వచ్చి కార్యాలయాలే ముందు నేషనల్ తెలిపిన అధికారులు స్పందించ కుంటే మరి ప్రజలకు ఏం చేస్తారని అసహ నం వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమా వేశాలు నిర్వహించడం లేదని తెలిపారు. కార్యాలయానికి తాళం వేసిన విషయం తెలుసుకున్న ఎస్సై చంద్రశేఖర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
నిరసన తెలు పుకుంటే తెలుపుకోండి.. ఆ స్వేచ్ఛ మీకు ఉం ది కాగా కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇ బ్బందులు సష్టించాలని చూడకూడదని, వెం టనే కార్యాలయానికీ తలం తీయాలని చెప్ప డంతో తాళం తీసి తన నిరసనను కొనసా గించారు. ఈ మీదకు ఎస్‌ఐ చంద్రశేఖర్ ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డికి సమాచారం ఇవ్వడంతో అతను బూతు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకు న్నారు.
దీంతో కౌన్సిలర్లు తమ నిరసన కార్య క్రమాన్ని విరమించుకోవడం జరిగింది. నిర సన కార్యక్రమంలో భూత్పూర్ కౌన్సిలర్లు బాలకోటి, రామకష్ణ, కో ఆప్షన్ నెంబర్ జాకీర్ పాషా, బీఆర్‌ఎస్ నాయకులు సత్తూ రు నారాయణ గౌడ్, అశోక్ గౌడ్, సత్యనా రాయణ, మురళీధర్ గౌడ్ తదితరులు ఉన్నారు.