- మరోసారి బెదిరింపు మెస్సేజ్
- నిందితుడిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు
ముంబై, అక్టోబర్ 30: కృష్ణజింకలను చంపిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాము డిమాండ్ చేసిన రూ.౨ కోట్ల్లు ఇవ్వకుంటే సల్మాన్‌ను చం పేస్తామని బాంద్రాకు చెందిన ఆజాం మహ్మద్ బెదిరించినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని చంపిన తరువాత సల్మాన్ కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. సల్మాన్‌కు బాబా సన్నిహితుడిగా పేరుంది. దీంతో సల్మాన్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తు న్నారు.
ఈ నేపథ్యంలో తాము డిమాండ్ చేసిన డబ్బును వెంటనే చెల్లించాలని.. లేకపోతే సల్మా న్‌ను చంపేస్తామంటూ ముంబై ట్రాఫిక్ కంట్రో ల్ రూమ్‌కు ఆజాం మెస్సేజ్ చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ హత్యకు కుట్ర?
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నట్లు పోలీసుల విచార ణలో తేలింది. ఇందుకోసం బంబిహా ముఠా లీడర్ కుశాల్ చౌధురీ ప్లాన్ రూపొందించినట్లు ఇండియాటుడే పేర్కొంది. లారెన్స్‌ను చంపి తన పలుకుబడిని పెంచుకోవడానికి కుశాల్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.
పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్యకు ప్రతీకారంగానే బిష్ణోయ్‌ను చంపుతానని 2022లో కుశాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బిష్ణోయ్ హత్య కోసం అమెరికాలో ఉంటున్న తన అనుచరుడు పవన్ షూకీన్ అలియాస్ సోనూతో కలిసి కుట్ర చేశాడని ఆ కథనంలో వివరించింది.