07-04-2025 09:56:48 PM
ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధుల తీర్మానం..
కామారెడ్డి కలెక్టరేట్లో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం..
కామారెడ్డి (విజయక్రాంతి): ఉద్యోగుల సత్తాను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ధర్నా కార్యక్రమానికి సిద్ధం కావాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు తీర్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిజిఏసి సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కార్మికులకు పెన్షనర్స్ కు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడం కోసం మా హక్కులను కాపాడుకోవడం కోసం ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ నరాల వెంకట్ రెడ్డి తెలిపారు.
దాదాపు రాష్ట్రంలో 13 లక్షల పైగా ఉద్యోగులు ఉన్నాం మా అందరికీ 206 సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ కలిస్తేనే టీజీ ఈ జె ఏ సి అనే రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా రిటైర్డ్ అవుతున్న ఉద్యోగస్తులకు ఎట్లాంటి డబ్బులు రావడం లేదు. రెండవది మా జిపిఎఫ్ మేము దాచుకున్న డబ్బులు కూడా సంవత్సరం దాటింది ఇప్పటిదాకా మాకు ఒక్క రూపాయి కూడా రాలే అవి మా డబ్బులే మేము దాచుకున్నవే, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు నాలుగు డిఏలు ఇవ్వాల్సిందే ఇప్పటికే సమయం అయిపోయింది. ఒక్కొక్క ఉద్యోగస్తునీకి 20000 పైన నష్టం జరుగుతుంది. పిఅర్సి కమిటీ కూడా ఇప్పటివరకు వేయలే అది తొందరగా పిఆర్సి కమిటీ వేయాలని ఉద్యోగులకు నాలుగు డిఏలు అందించాలని డిమాండ్ చేశారు.
పెన్షనర్లకు బకాయి లేకుండా అన్ని రకాల డబ్బులు ఇవ్వాలని అదే రకంగా ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న వారిని తీసేసి రోడ్డు మీదికి విసిరివేయడం సమంజసమైంది కాదన్నారు. ఇవన్నీ మా హక్కులు సాధించుకోవడం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉద్యోగ జేఏసీ పోరాట కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏప్రిల్ ఒకటి నుండి 30 వరకు జిల్లా కేంద్రంలో సదస్సులు నిర్వహించడం ప్రజాప్రతిని నిధులను కలవడం మే 4న రాష్ట్రస్థాయి ఉద్యోగ సదస్సుకు అందరు హాజరయ్యేటట్లు చూడడం మే 15న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
జూన్ 9 న రాష్ట్ర స్థాయి మహా ధర్నాకు ప్రతి ఉద్యోగస్తుడు విధిగా హైదరాబాదులో జరిగే మహాధర్నాకి హాజరై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మికుల యొక్క సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘాల జేఏసీ కన్వీనర్ నరాల వెంకట్ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు టీజీవో అధ్యక్షుడు డాక్టర్ దేవేందర్, కుషాల్, ఎల్లారెడ్డి, సాయిరెడ్డి, బషీర్, బాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.