calender_icon.png 8 April, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సత్తాను ప్రభుత్వానికి తెలియజేస్తాం

08-04-2025 12:00:00 AM

ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధుల తీర్మానం

కామారెడ్డి, ఏప్రిల్7 (విజయక్రాంతి): ఉద్యోగుల సత్తాను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ధర్నా కార్యక్రమానికి సిద్ధం కావాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు తీర్మానించారు.  కామారెడ్డి జిల్లా కేంద్రంలో టి జి ఏ సి సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు.

ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కార్మికులకు పెన్షనర్స్ కు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడం కోసం మా హక్కులను కాపాడుకోవడం కోసం ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ నరాల వెంకట్ రెడ్డి తెలిపారు. మే 15 న  జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

జూన్ 9 న రాష్ట్ర స్థాయి మహా ధర్నాకు ప్రతి ఉద్యోగస్తుడు విధిగా హైదరాబాదులో జరిగే మహాధర్నాకి హాజరై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మికుల యొక్క సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘాల జేఏసీ కన్వీనర్ నరాల వెంకట్ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు టీజీవో అధ్యక్షుడు డాక్టర్ దేవేందర్, కుషాల్, ఎల్లారెడ్డి, సాయిరెడ్డి, బషీర్, బాబు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.