calender_icon.png 2 November, 2024 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెస్‌చార్జీలు పెంచుతాం

15-08-2024 12:04:26 AM

గురుకులాల్లో సమస్యలను పరిష్కరిస్తాం 

మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

‘ముప్పూటల భోజనం  ౩౦ రూపాయలకే!’ అని ‘విజయక్రాంతి’ కథనం ప్రచురించిన రోజే మంత్రి ప్రకటన 

హుస్నాబాద్, ఆగస్టు 14: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా గురుకుల పాఠశాలలు, హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని రాష్ట్ర రవాణ శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘ముప్పూటల భోజనం ౩౦ రూపాయలకే!’ అనే శీర్షికన ‘విజయక్రాంతి’ బుధవారం  సంచికలో పతాక శీర్షిక వార్తను ప్రచురించిన విషయం తెలిసిందే.

హాస్టల్ విద్యార్థులు  చాలీచాలని మెస్‌చార్జీలతో సతమతమవుతున్నారని ‘విజయక్రాంతి’ విపులంగా కథనాన్ని అందించింది. గురుకులాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి పొన్నం చెప్పారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎమ్మెల్యే, విద్యాశాఖ, గురుకుల విద్యాసంస్థల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ గురుకుల పాఠశాలలు, హాస్టల్స్‌ను సందర్శిస్తుందని తెలిపారు.

కమిటీ గుర్తించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ప్రభుత్వం అదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి రూ.5వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వాటితో అన్ని విద్యాసంస్థలకు స్థలాలు కేటాయించి, భవనాల నిర్మాణం చేపడుతామని పేర్కొన్నా రు. హుస్నాబాద్‌లోని యువ రైతులకు వ్యవసాయ అధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అవసరమైన రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.