calender_icon.png 30 November, 2024 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుర్వేద కాలేజీల్లో సీట్లు పెంచుతాం

30-10-2024 02:27:05 AM

  1. త్వరలో స్టుఫైండ్ రిలీజ్‌కు చర్యలు
  2. విద్యార్థులకు కొత్త హాస్టల్ భవనాలు 
  3. ఆయుర్వేద దినోత్సవంలో మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్, వరం గల్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలల్లో యూజీ, పీజీ సీట్ల సంఖ్యను పెంచుతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఆయుర్వేద వైద్య విద్యా ర్థుల కోసం కొత్త హాస్టల్ భవనాలను నిర్మిస్తామన్నారు.

9వ జాతీయ ఆయుర్వేద దినో త్సవం సందర్భంగా మంగళవారం ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వ హించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నా రు. ఇటీవల నియమించిన 628 మంది పార్ట్ టైమ్ యోగా ఇన్‌స్ట్రక్టర్లకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందించారు. మరో 214 మందిని త్వరలో నియమిస్తామని తెలిపారు.

ఆరోగ్య మందిర్స్‌లో యోగా ఇన్‌స్ట్రక్టర్లు ఉచితంగా యోగా నేర్పిస్తారన్నారు. ప్రపంచమం తా యోగా, ఆయుర్వేదాన్ని ఆదరిస్తోందన్నారు. తెలంగాణలోనూ ఈ విభాగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయుర్వేదం, యోగా, వేద జ్ఞానం ద్వారా ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో మన పూర్వీకులు తెలియజేశారని, అయితే మనం దాన్ని కొనసాగించలేకపోయామన్నారు. 

యోగా, ఆయుర్వేదం మతా నికి సంబంధించిన అంశాలు కాదన్నారు. వాటిని మానవాళి మనుగడకు సంబంధించిన అంశాలుగా మంత్రి స్పష్టం చేశారు. వాటి ప్రముఖ్యతను ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. పిల్లలకు యోగా నేర్పించాలని సూచించారు. ఆయుర్వేదంపై గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.

ఆయు ష్ డైరెక్టరేట్‌ను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. వారం రోజుల్లో స్టుఫైండ్ చెల్లిస్తామని విద్యార్థులకు తెలిపారు. స్టుఫైండ్ పెంపు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆయుష్ శాఖలో సీనియారిటీ మేరకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. అనంతరం మంత్రి ఆయుర్వేద కళాశాలను తనిఖీ చేసి రోగుల సమస్యలు తెలుసుకున్నారు. కార్రక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ఆయుష్ అధికా రులు పాల్గొన్నారు.