ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి...
మహేశ్వరం (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి(MLC Patnam Mahender Reddy) అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో సుమారు రూ.45కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన స్థానిక మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పట్నం మహేందర్ రెడ్డి బట్టేల్ గుట్ట పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించి, కోట బురుజుపై ఉన్న అహ్లాదకరమైన వాతావరణం చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమిషనర్ సరస్వతి, డిఈఈ జ్యోతి, నరసింహ రాజ్, ఏఈ వినీల్ గౌడ్, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.