పెద్దపల్లి యువవికాసం సభను విజయవంతం చేయండి
మీడియ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు
పెద్దపల్లి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఏడాది పాలనలో అద్భుత విజయాలు సాధించామని, ప్రజలకు మరిం త మేలు చేస్తామన్నారు. పెద్దపల్లిలోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కన్ సింగ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం పెద్దపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. యువవికాసం సభకు భారీగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణంపై సీఎం స్పష్టమైన ప్రకటన చేస్తారని అన్నారు. ప్రాజెక్టు సర్వే కోసం నిధులు కేటాయిస్తారని తెలిపారు. పెద్దపల్లిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు ప్రకటన కూడా చేస్తారని, పెద్దపల్లి సుల్తానాబాద్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి శంకు స్థాపన చేస్తారన్నారు.
రూ.5 కోట్లతో స్వశక్తి మహిళ నిర్మాణాకి శంకుస్థాపన, రామగుండంలో రూ.60 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులకు శంకుస్థాపన, మంథనిలో ఆర్‌అండ్‌బీ పెండింగ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అంతర్గం, మంథని, గంగపురిలో, పోతారం గ్రామాల్లో33 బై లేవన్ కేవీ సబ్ స్టేషన్ల పనులకు శంకుస్థాపన, అంతర్గం మండలంలోని బ్రాహ్మణపల్లిలో బండలవాడు లిఫ్టు ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.
మంథనిలో ప్రభుత్వ దవాఖానలో 100 పడకల దవాఖాన, గుంజపడుగలో 30 పడకల ఆసుపత్రిని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారన్నారు. పెద్దపల్లిలో 50 పడలక ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తారన్నారు. జిల్లాలో 60 వేల మందికి పైగా రైతులకు రూణమాఫీ అయిందని, సింగరేణి లో 500 మందికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు జనక్‌ప్రసాద్, ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ఈర్ల స్వరూప పాల్గొన్నారు.