09-03-2025 05:01:45 PM
బైంసా (విజయక్రాంతి): రాబోయే బైంసా మున్సిపల్ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బిజెపి నాయకులు కార్యకర్తలు పని చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో బిజెపి కమిటీ ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బి గంగాధర్, బిజెపి పట్టణ అధ్యక్షులు ఎనపోతుల మల్లేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.