28-04-2025 01:58:43 AM
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): దక్షిణాది ప్రజలకు బీజేపీ మేలు చేస్త్తోందని.. తద్వారా వారి హృదయాల్లో చోటు సంపాదించి, ఇక్కడ కూడా జెండా ఎగరేస్తామని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని భరోసానిచ్చారు.
విజయవా డలో ఆదివారం జరిగిన అంబేద్కర్ 135వ జయంత్యోత్సవాల్లో భాగంగా మేధావుల సదస్సులో పాల్గొన్న కిషన్‌రెడ్డి, ప్రధాని మన్‌కీబాత్ కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం మేధావుల సదస్సులో ప్రసంగిస్తూ స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించి, రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే, ఆయన్ను ఓడించాలని నెహ్రూ విస్తృతంగా ప్రచారం చేశారని, అదీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని విమర్శించారు.
కాంగ్రె స్ ప్రచారాన్ని తిప్పి కొట్టి పార్లమెంట్ కు పంపించేలా మేధావులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కాంగ్రెస్ వ్యవహారించిందని వాపోయారు. అధికారాన్ని నిలుపుకోవడం కోసం కాంగ్రె స్ పార్టీ రాజ్యాంగాన్ని అనుకూలంగా మార్చుకుందన్నారు. మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ రాజీనామా చేసేలా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు.
అం బేద్కర్ ఆశయాల స్ఫూర్తితోనే బీజేపీ ప్రభు త్వం పనిచేస్తుందని చెప్పారు. రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతంగా ఉండాలని మోదీ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. దేశానికి సేవ చేసిన అంబేద్కర్‌కు కాంగ్రెస్ భారతరత్న ఇవ్వకుండా అవమానించిదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే అంబేద్కర్‌కి భారతరత్న ఇచ్చిందని గుర్తుచేశారు.