calender_icon.png 15 January, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులను ఆదుకుంటాం

06-09-2024 12:00:00 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే హీరోలు భారీ విరాళాలు ప్రకటించగా, ఇండస్ట్రీలోని ఇతర డిపార్ట్‌మెంట్లు సాయం చేసేందుకు నిర్ణయించుకున్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించింది. అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షల విరాళం తెలిపింది.

అలాగే ఫెడరేషన్ తరపున చెరో 5 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఇక దగ్గుబాటి కుటుంబం తరపున నిర్మాత సురేశ్ బాబు ఇరు రాష్ట్రాలకు కోటి రూపాయలు ప్రకటించగా, దిల్ రాజు చెరో 25 లక్షల విరాళం ప్రకటించారు. సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ..“ వరద బాధితుల కోసం విరాళాలు, వస్తువులను సేకరించేందుకు సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. నగదు మాత్రమే కాకుండా నిత్యావసరాలను కూడా అందిస్తాం” అని చెప్పారు. ఆ తర్వాత దిల్ రాజు, డైరెక్టర్ రాఘవేందర్ రావు మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.