యూఎస్ కేసులపై స్పందించిన గౌతమ్ అదానీ
జైపూర్, డిసెంబర్ 1: తమపై జరిగే ప్రతీ దాడితో తాము మరింత పటిష్టపడతామని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. యూఎస్‌లో కేసులు నమోదైన తర్వాత తొలిసారిగా స్పందించిన అదానీ జైపూర్‌లో జరిగిన జెమ్స్ అండ్ జ్యువెలరీ సదస్సులో మాట్లాడుతూ రెండు వారాల క్రితం తమ కార్పొరేట్ పాలనా విధానాలపై యూఎస్ నుంచి ఆరోపణల్ని ఎదుర్కొన్నామని, అటువంటి సవాళ్లను చవిచూడటం ఇదే మొదటిసారి కాదన్నారు.
యూఎస్ విదేశీ అవినీతి చట్టాన్ని ఉల్లంఘించినట్లుగానీ లేదా అక్కడి న్యాయవ్యవస్థను తప్పుదోవపట్టించే అభియోగాలు అదానీ వైపు నుంచి ఏ ఒక్కరిపై నమోదుకాలేదని వెల్లడించారు. కానీ ఇప్పటి ప్రపంచంలో వాస్తవాలకంటే ప్రతికూలాంశాలే వేగంగా విస్తరిస్తాయంటూ గౌతమ్ అదాన చెపుతూ తమ గ్రూప్ రెగ్యులేటరీ నిబంధనలకు కట్టుబడి ఉందన్నారు. తమ గ్రూప్‌నకు ఎదురవు తున్న సవాళ్లు తమను మరింత పటిష్టపరుస్తాయని, ప్రతీ పతనం తర్వాత మళ్లీ గట్టిగా లేచి నిలబడతామన్నారు.