calender_icon.png 13 October, 2024 | 5:55 AM

6.57 శాతం వృద్ధి సాధిస్తాం

23-08-2024 12:30:00 AM

ఆర్థిక శాఖ నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఆర్థిక వ్యవస్థ జోరు ను కొనసాగిస్తున్నదని, ఆర్థిక సర్వేలో ప్రస్తావించిన 6.57 శాతం వృద్ధి రేటును సాధిస్తా మని గురువారం కేంద్ర ఆర్థిక శాఖ నెలవారీ సమీక్షలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఎకానమీ మూమెంటం చూపించిందని, ఆర్థిక కార్యకలాపాలను సూచించే జీఎస్టీ వసూళ్లు పెరి గాయని తాజా నివేదికలో పేర్కొంది. తయా రీ, సేవల రంగాలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని, తయారీ కంపెనీలకు ఎగుమతి ఆర్డర్లు పెరుగుతున్నాయన్నది. ఈశాన్య రుతుపవనాలు స్థిరంగా విస్తరిస్తున్నందున ఖరీఫ్ సాగు పెరిగిందని, రిజర్వా యిర్ల నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీ పంటలు బాగుంటాయని అంచనా వేసింది.